Saturday, 7 November 2015

ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఆన్ లైన్లో చేపట్టేందుకు రెడీ అవుతున్నారు అధికారులు

ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఆన్ లైన్లో చేపట్టేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. ప్రయోగాత్మకంగా ఈ ఏడాది మార్చి పరీక్షల నుంచే అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ తక్కువ అన్సర్ సీట్స్ ఉండే అరబిక్ , స్పానిస్, ఉర్దూ సబ్జెక్ట్ పేపర్లను ఆన్ లైన్లో వాల్యుయేషన్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత విడతల వారీగా అన్ని సబ్జెలకు ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఏటా దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు పూర్తైన తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేపడతారు. అయితే అధ్యాపకులతో జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించడంతో కొన్నస్లారు పొరపాట్లు జరుగుతున్నాయి. వాల్యుయేషన్ చేసేవారు పేజీలు సరిగా చూడకపోవడం…మార్కుల కౌంటింగ్ లో తేడాలు వస్తున్నాయి. రీ వాల్యుయేషన్ చేస్తే మార్కులు పెరుగుతున్నాయి. దీంతో మాన్యువల్  విధానానికి గుడ్ బై చెప్పనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. ఆన్ లైన్ పేపర్ వాల్యుయేషన్లో ఆన్సర్ షీట్స్ అన్ని స్కాన్ చేసి కంప్యూటర్ లోకి అప్ లోడ్ చేస్తారు. ప్రతీ పేజీ మూల్యాకనానికి కొంత టైం కేటాయిస్తారు. ప్రతీ పేజీ వరుసక్రమంలో చూడాల్సి ఉంటుంది. ఒక పేజీ వదిలి మరో పేజీకి వెళ్లే చాన్స్ ఉండదు. ఫస్ట్ పేపర్ పూర్తైన తర్వాతే రెండో పేజీ ఓపెన్ అవుతుంది. మార్కు కూడా అప్పుడే కౌంట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ తోపాటు విద్యార్థులకు సంబంధించిన 22 సేవలను ఆన్ లైన్లో అందిస్తామంటున్నారు విద్యాశాఖ అధికారులు.

No comments:

Post a Comment